Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రాజ్యసభ మాజీ సభ్యులు, ఆర్ఎస్పీ నేత, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు అబని రారు గురువారం ఉదయం 10.30 గంటలకు కన్నుమూశారు. 82 సంవత్సరాల అబని రారు దీర్ఘకాలంగా వయస్సు సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. అబని రారు 1996 నుంచి 2011 వరకూ పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. కేంద్రంలో పర్యాటకం, రవాణా, కార్మిక, ఆర్థిక వంటి అనేక కీలక మంత్రిత్వ శాఖలకు చెందిన సలహా కమిటీల్లో సభ్యునిగానూ రారు ఉన్నారు. 1995లో కొల్కత్తా కార్పొరేషన్ కౌన్సిలర్గానూ ఎన్నికయ్యారు. 1959లో ఆర్ఎస్పీలో రారు చేరారు. రారు మృతిపై ఆర్ఎస్పి ప్రధాన కార్యదర్శి మనోజ్ భట్టాచార్య తీవ్ర విచారం వ్యక్తం చేశారు.