Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకు తెలిపిన కేంద్రం
న్యూఢిల్లీ : ఆర్థికంగా బలహీన వర్గాలను (ఈడబ్ల్యూఎస్) గుర్తించడానికి నిర్దేశించిన ఏడాదికి రూ. 8 లక్షల ఆదాయ పరిమితిపై పునపరిశీలన చేస్తామని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. అఖిల భారత కోటా (ఏఐక్యూ)లో భాగంగా ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్ 10 శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తూ జులై 29న విడుదల చేసిన నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా నీట్ విద్యార్తుల పిటీషన్ విచారణలో కేంద్రం ఈ విషయాన్ని వెల్లడించింది. '2019లో చేసిన 103 రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చబడిన ఆర్టికల్ 15 వర్ణించే ఆర్థికంగా బలహీన వర్గాలను ప్రమాణాలను పునపరిశీలన చేయడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది' అని జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఒక షార్ట్ ఆర్డర్లో నమోదు చేసింది. తదుపరి విచారణను 2022 జనవరి 6కు వాయిదా వేసింది. గురువారం విచారణకు కేంద్ర ప్రభుత్వం తరుపున సొలిసిటర్ జనరల్ తుషార్ మొహతా, అదనపు సొలిసిటర్ జనరల్ కెఎం నట్రాజ్ హజరయ్యారు. ఏడాదికి రూ. 8 లక్ష ఆదాయ పరిమితిని పన పరిశీలన చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు సుప్రీంకోర్టుకు తెలిపారు.
అరుముఘస్వామి కమిషన్‌కు సహాయంగా మెడికల్ ప్యానల్ ఏర్పాటు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంలో వాస్తవాలు గుర్తించేందుకు విచారణ చేస్తున్న జస్టిస్ ఎ.అరుముఘస్వామి కమిషన్‌కు సహాయంగా ఎయిమ్స్‌కు చెందిన వైద్య నిపుణులతో ఒక ప్యానల్ ఏర్పాటు చేయనున్నట్టు సుప్రీంకోర్టు గురువారం మౌఖికంగా వెల్లడించింది. జయలలిత మరణంపై విచారణ చేస్తున్న అరుముఘస్వామి కమిషన్ పక్షపాతంగా వ్యవహరిస్తోందని, న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తుందని, అధికార పరిధిని దాటి వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ అపోలో హస్పటల్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటీషన్‌ను గురువారం జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్, కష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం విచారించింది. పూర్తి వివరాలతో కూడిన మెమోను సిద్ధం చేయాలని ఆస్పత్రిని కోరింది. ఆ మెమోను పరిశీలించి ఉత్తర్వులు జారీ చేస్తామని కోర్టు తెలిపింది. సోమవారంలోగా తన మెమో కాపీని విచారణ కమిషన్‌తో పంచుకోవాలని ఆసుపత్రిని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఆపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయలలిత మరణించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 22, 2016న జయలలిత ఆసుపత్రిలో చేరడానికి దారితీసిన పరిస్థితులను, చికిత్స తీరును విచారించడానికి మద్రాసు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఆరుముఖస్వామి నేతత్వంలో కమిషన్‌ను ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 25, 2017న తమిళనాడు ప్రభుత్వం ఈ కమిషన్‌ను నియమించింది.