Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం ప్రకటించిన అరకొర మద్దతుధర
- అదీ కూడా రైతులకు అందని ద్రాక్షే
- స్పష్టం చేసిన గణాంకాలు
న్యూఢిల్లీ : దేశంలోని రైతాంగం తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ఇస్తున్నామని అబద్ధాలు చెబుతుంది. ఇచ్చిన అరకొర ధర కూడా రైతులకు అందని ద్రాక్ష వలే మిగిలిపోయింది. అందుకు ప్రభుత్వ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 23 పంటలకు మాత్రమే మద్దతు ధర ప్రకటిస్తుంది. మిగిలిన పంటలకు మద్దతు ధర ఇవ్వటం లేదు. దేశంలో 6 శాతం మంది రైతులు మాత్రమే ప్రభుత్వం ప్రకటించిన నామమాత్రపు మద్దతు ధరను పొందుతున్నారు. మిగిలిన 94 శాతం మంది రైతులకు ఆ అరకొర మద్దతు ధర కూడా అందటం లేదు. అదే ఉత్తరప్రదేశ్‌లో అయితే రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రాష్ట్రంలో 70 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు లక్ష్యం ఉంటే, ఇప్పటి వరకు కేవలం 4.98 లక్షల మెట్రిక్ టన్నుల మాత్రమే జరిగింది. 4 వేల కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని హామీ ఇవ్వగా, కేవలం 1,712 కేంద్రాలు మాత్రమే ప్రారంభించారు. రైతులు మండీల చుట్టూ తిరుగుతున్నారు. ధాన్యం సేకరణ కోసం 6,42,224 మంది రైతులు నమోదు చేసుకోగా, ఇప్పటి వరకు 71,352 మంది రైతుల నుంచి మాత్రమే ధాన్యం సేకరించారు. గత్యంతరం లేక రైతులు కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1,940 ఉంటే, బయట ప్రయివేట్ వ్యక్తులకు రూ.1,250 అమ్ముకోవాల్సి వస్తుంది. కేరళ మినహా అన్ని రాష్ట్రాల్లో రైతులు పరిస్థితి ఇదే రకంగా ఉంది.
ఎంఎస్పీ లేక రైతులు ఎలా నష్ట పోతున్నారంటే..?
స్వామి నాథన్ కమిషన్ సిఫారసు మేరకు సీ2o50 శాతం ఫార్ములా ప్రకారం ఎంఎస్పీ లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. అన్ని వాతా వారణ పరిస్థితులను ఎదుర్కొని పంటను అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఏదో రకంగా అమ్ముకుందామని ప్రయత్నిస్తే, గిట్టుబాటు ధర రావటం లేదు. పండించిన పంటకు అయ్యే ఖర్చు కూడా రావటం లేదు. దీంతో రైతులు అప్పులు పాలవుతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎ2ంఎఫ్ఎల్ ఫార్ములా ఉపయోగించి కేంద్ర వ్యవవసాయ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్టు అండ్ ప్రైస్ (సీఏసీపీ) మద్దతు ధర ప్రకటిస్తుంది. ఉదాహరణకు వరి క్వింటా ఎ2ంఎఫ్ఎల్ రూ.1,293 ఉంటే, సి2 రూ.1,727 ఉంది. సి2ం50 శాతం కలిపితే రూ. 2,590.5 ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినది మాత్రం కేవలం రూ. 1,940 మాత్రమే, అంటే ఒక్కొ క్వింటాకు రైతు రూ.650.5 నష్ట పోతున్నాడు. అలాగే పత్తి విషయంలో కూడా రైతులు ఒక క్వింటాకు రూ.2,027.5, నువ్వులు క్వింటాకు రూ.2,672.5, వెర్రి నువ్వులు క్వింటాకు రూ.2,731.5 కోట్లు, సన్‌ఫ్లవర్ క్వింటాకు రూ.1,525.5, పెసలు క్వింటాకు రూ.1,890, కందులు క్వింటాకు రూ.1,636.5, వేరుశెనగ క్వింటాకు రూ.1,548 నష్టపోతున్నారు.
ఎకరాకు ఎంత నష్టపోతారంటే.?
సి2o50 శాతం ప్రకారం ఎంఎస్పీ లేకపోవడంతో రైతులు ఎకరాకు వివిధ రాష్ట్రాల్లో వివిధ స్థాయిల్లో నష్ట పోతున్నారు. కేరళలో మాత్రం సి2ం50 శాతం కంటే అధికంగా ధర వస్తుంది. అక్కడ రైతులు అధిక లాభాలను పొందుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో రైతులు ఒక్క వరి విషయంలోనే క్వింటాకు రూ.29,800 ఎకరాకు నష్టపోతున్నారు. మూడు ఎకరాల రైతు అయితే రూ.1,12,000 నష్ట పోతున్నాడు. వరికి సి2ం50 శాతం ప్రకారం ఎంఎస్పీ రూ.2,590 ఉంటే, కేరళలో రూ.2,800లకు రైతులు అమ్ముతున్నారు. అంటే స్వామినాథన్ సిఫారసుల కంటే, అధనంగా క్వింటాకు రూ.210 వేసి కేరళ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మిలిగిన రాష్ట్రాల్లో స్వామినాథన్ కమిటీ సిఫారసుల మేరకు ధాన్యం సేకరణ జరగటం లేదు. ఎకరాకు 20 క్వింటాలు ధాన్యం అయితే, మద్దతు ధర లేక, ఉన్న అరకొర మద్దతు ధర కూడా సేకరణ కాకపోవడంతో యూపీలో రూ.29,800, జార్ఖండ్‌లో రూ.27,800, పంజాబ్‌లో రూ.12,600 నష్ట పోతున్నారు.
ఎంఎస్పీ లేకనే రైతు ఆత్మహత్యలు..!
రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం కనీస మద్దతు ధర లేకపోవడమేనని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నాలుగు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అందులో మోడీ వచ్చిన తరువాతే లక్ష మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దేశంలో ప్రతి రోజూ 52 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఒక్క మహారాష్ట్రలోనే 1995 నుంచి ఇప్పటి వరకు 60,750 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఎన్సీఆర్బీ స్పష్టం చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్, గుజరాత్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అత్యధికంగా రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఎన్సీఆర్బీ పేర్కొంది. 2017, 2018ల్లో ప్రతి రోజు పది మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, ఆ రెండేండ్లలో ఏడాదికి రూ.5,760 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2013 నుంచి ఇప్పటి వరకు 2019 మధ్య రైతులు అప్పులు 58 శాతం పెరిగాయి.
క్వింటాకు పంట ఎ2ంఎఫ్ఎల్ సి2 సి2ం50 శాతం కేంద్రం ఎంఎస్పీ సి2ంఎఫ్ఎల్ంఎంఎస్పి (క్వింటాకు రైతు నష్టపోయిన మొత్తం)
వరి రూ.1,293 రూ.1,727 రూ.2,590.5 రూ.1,940 రూ.650.5
జొన్న రూ.1,825 రూ.2,478 రూ.3,717 రూ.2,738 రూ.979
సజ్జలు రూ.1,213 రూ.1,579 రూ.2,368.5 రూ.2,250 రూ.118.5
రాగులు రూ.2,251 రూ.3,004 రూ.4,506 రూ.3,377 రూ.1,129
మొక్కజొన్న రూ.1,246 రూ.1,654 రూ.2,481 రూ.1,870 రూ.611
కందులు రూ.3,886 రూ.5,291 రూ.7,936.5 రూ.6,300 రూ.1,636.5
మినప రూ.3,816 రూ.5,133 రూ.7,699.5 రూ.6,300 రూ.1,399.5
పెసలు రూ.4,850 రూ.6,110 రూ.9,165 రూ.7,275 రూ.1,890
వేరుశెనగ రూ.3,699 రూ.4,732 రూ.7,098 రూ.5,550 రూ.1,548
సోయాబిన్ రూ.2,633 రూ.3,439 రూ.5,158.5 రూ.3,950 రూ.1,208.5
సన్‌ఫ్లవర్ రూ.4,010 రూ.5,027 రూ.7,540.5 రూ.6,015 రూ.1,525.5
నువ్వులు రూ.4,871 రూ.6,653 రూ.9,979.5 రూ.7,307 రూ.2,672.5
వెర్రి నువ్వులు రూ.4,620 రూ.6,441 రూ.9,661.5 రూ.6,930 రూ.2,731.5
పత్తి రూ.3,817 రూ.5,169 రూ.7,753.5 రూ.5,726 రూ.2,027.5
రాష్ట్రం ఎ2ంఎఫ్ఎల్ అమ్ముతున్న ధరఎకరాకు రైతు ఆదాయం సి2ం50 శాతం అందకపోవడం రైతుకు నష్టం ఎకరాకు
కేరళ రూ.2,800 రూ.2,800 రూ.56 వేలు నష్టం లేదు, రూ.4,200 లాభం
పంజాబ్ రూ.1,960 రూ.1,960 రూ.39,200 రూ.12,600 నష్టం
జార్ఖండ్ రూ.1,960 రూ.1,200 రూ.24 వేలు రూ.27,800 నష్టం
ఉత్తరప్రదేశ్ రూ.1,960 రూ.1,100 రూ.22 వేలు రూ.29,800 నష్టం