Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ది స్టేట్ ఆఫ్ పెట్
- హోమ్‌లెస్‌నెస్ ఇండెక్స్ డేటా
- ఆల్ పెట్స్ వాంటెడ్ స్కోర్‌లో దిగువన భారత్
భారతదేశం ప్రజాసమస్యలకు సంబంధించిన అన్ని సూచీల్లో ఉంటే..తాజాగ ఆల్ పెట్ వాంటెడ్ స్కోర్‌లోనూ భారత్ దిగువన ఉన్నది. ది స్టేట్ ఆఫ్ పెట్ హోమ్‌లెస్‌నెస్ ఇండెక్స్ డేటాలో వెల్లడైంది. మొత్తం మీద 10 పాయింట్ల స్కేల్‌పై భారత్ 2.4 పాయింట్లు మాత్రమే సాధించింది.
న్యూఢిల్లీ: భారతదేశంలో దాదాపు 6.2 కోట్ల వీధికుక్కలు, 91 లక్షల వీధి పిల్లులు ఉన్నాయి దేశంలోని 77 శాతం మంది ప్రజలు కనీసం వారానికి ఒకసారి వీధికుక్క కనిపిస్తున్నదని తాజా నివేదికలో వెలుగులోకి వచ్చింది. 'ది స్టేట్ ఆఫ్ పెట్ హోమ్‌లెస్‌నెస్ ఇండెక్స్ డేటా ఫర్ ఇండియా' డేటా ప్రకారం.. విచ్చలవిడిగా జంతువుల సంఖ్య పెరుగుతోంది. అయినా భారత్‌లో నిర్ధారిత స్కోర్‌లో దిగువన ఉన్నది. మొత్తం మీద 10 పాయింట్ల స్కేల్‌పై భారత్ 2.4 పాయింట్లు సాధించింది. జనాభాలో దాదాపు 68 శాతం మంది (10 మందిలో ఏడుగురికి ) వారానికి కనీసం ఒకసారైనా వీధుల్లో పిల్లులు కనిపిస్తాయని చెబుతుండగా, దాదాపు 77 శాతం మంది (10మందిలో ఎనిమిది మంది) వారానికి ఒక్కసారైనా దారితప్పిన శునకాలను చూస్తున్నట్టు పేర్కొంది. కొత్త ఇండెక్స్ ప్రకారం, దేశంలో దాదాపు ఎనిమిది కోట్ల వీధి పిల్లులు, కుక్కలు ఉన్నాయి, ఇందులో 6.2 కోట్ల వీధికుక్కలు , 91 లక్షల వీధి పిల్లులు ఉన్నాయి. అలాగే షెల్టర్ హౌమ్‌లో 88 లక్షల వీధికుక్కలు, పిల్లులు ఉన్నాయి. భారతదేశంలో 85 శాతం పెంపుడు జంతువులను వదిలివేసినట్టు కూడా సూచిక పేర్కొంది. భారతదేశంలో సాధారణ జనాభాలో 61 శాతం మంది దూరం, కీర్తి లేదా సౌకర్యాల వంటి కారణాలతో పశువైద్యుని వద్దకు వెళ్లడం లేదని తేలింది. ఇది ప్రపంచ సగటు 31 శాతం కంటే గణనీయంగా ఎక్కువ. ఇండెక్స్ ప్రకారం 'ఆల్ పెట్స్ కేర్ ఫర్' స్కోర్‌ను తగ్గిస్తుంది.భారత్‌లో జంతు హక్కుల కోసం వాదించే పీపుల్ ఫర్ యానిమల్స్ (పీఎఫ్ఏ) అనే ప్రభుత్వేతర సంస్థ గౌరీ ములేఖి మాట్లాడుతూ, దేశంలో ప్రతి 100 మందికి కనీసం మూడు వీధికుక్కలు ఉన్నాయని తెలిపారు. అలాగే వదిలివేస్తున్న జంతువుల పెరుగుదలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. నివేదిక ప్రకారం, చైనాలో నిరాశ్రయులైన కుక్కలు , పిల్లులు 7.5 కోట్లు ఉంటే..యూఎస్‌లో 4.8 కోట్లు, జర్మనీలో 20.6 లక్షలు, గ్రీస్‌లో 20 లక్షలు, మెక్సికోలో 74 లక్షలు, రష్యా ,దక్షిణాఫ్రికాలో 41 లక్షలు, బ్రిటన్‌లో 11 లక్షల పిల్లులు, కుక్కలు ఉన్నాయని నివేదికలో తేలింది.