Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవ్యాప్తంగా 56.5 శాతానికి చేరిక : ఎన్ఎఫ్హెచ్ఎస్ సమాచారం
న్యూఢిల్లీ : భారత్లో గర్భనిరోధకాల వినియోగం పెరుగుతున్నది. గత ఐదేండ్లలో ఇది 8.7 శాతం పాయింట్లు పైకి ఎగబాకింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 (ఎన్ఎఫ్హెచ్ఎస్) సమాచారం ద్వారా ఈ విషయం తెలిసింది. దీని ప్రకారం.. కుటుంబ నియంత్రణ కోసం ఆధునిక గర్భనిరోధకాల వినియోగం ఎన్ఎఫ్హెచ్ఎస్-4 (2015- 16)లో 47.8 శాతంగా ఉన్నది. అయితే, అది ఎన్ఎఫ్హెచ్ఎస్-5 (2019-2020) లో 56.5 శాతానికి ఎగబాకడం గమనార్హం. అంటే ఈ ఐదేండ్లలో 8.7 శాతం పాయింట్ల పెరుగుదల నమోదైంది.దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో (36కు గానూ) గర్భ నిరోధకాల వినియోగంలో పెరుగుదల నమోదైంది. ఎన్ఎఫ్హెచ్ఎస్-4లో బీహార్లో ఆధునిక గర్భ నిరోధక వ్యాప్తి రేటు 23.3శాతంగా ఉండగా, ఎన్ఎఫ్హెచ్ఎస్-5 నాటికి అది దాదాపు రెండింతలు పెరిగి 44.4శాతంగా నమోదు కావడం గమనార్హం. ఇక యూపీలో ఇది 31.7 శాతం నుంచి 44.5శాతానికి ఎగబాకింది.