Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికులను సస్పెండ్ చేసిన మహారాష్ట్ర ఆర్టీసీ
ముంబయి: మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఎంఎస్ఆర్టీసీ)ను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఉద్యోగులు నెల రోజులుగా సమ్మె చేస్తున్నారు. కాగా.. సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులపై ఎంఎస్ఆర్టీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో వారిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శనివారం 3,010 మంది ఉద్యోగులను ఎంఎస్ఆర్టీసీ సస్పెండ్ చేసింది. మరో 270 మంది కార్మికులను విధుల నుంచి తొలగించింది. దీంతో ఇప్పటి వరకు సస్పెండ్ అయిన ఉద్యోగుల సంఖ్య 6,277కి చేరగా.. 1,496 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇటీవల రాష్ట్ర రవాణాశాఖ మంత్రి.. ఆర్టీసీ కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఉద్యోగులు వెంటనే విధుల్లోకి చేరాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.