Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భువనేశ్వర్: ఒడిశాలోని పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో మద్యానికి బానిసలవుతున్న వారి సంఖ్య అధికంగా పెరుగుతున్నదని తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 (హెన్ఎఫ్హెచ్ఎస్) పేర్కొంది. రాష్ట్రంలోని మొత్తం మద్యం వినియోదారుల్లో మహిళలు 4.9 శాతం ఉన్నారు. అయితే, రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లోని మహిళ కంటే గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు అధికంగా ఉండటం గమనార్హం. తాజాగా విడుదలైన ఎన్ఎఫ్హెచ్ఎస్-5 నివేదిక ప్రకారం రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలకంటే గ్రామీణ ప్రాంతాల్లో మద్యం బానిసల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, పురుషుల కంటే ఎక్కువ మంది మహిళలు మద్యానికి బానిసలు అవుతున్నారని నివేదిక పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో 15, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషుల్లో 22.7 శాతం మంది మద్యం సేవిస్తున్నారు. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో, ఇదే వయస్సు గ్రూపునకు చెందిన పురుషుల్లో 30.2 శాతం మంది మద్యం వ్యసనానికి బలైపోయారు. మద్యానికి బానిసలైన మహిళల గణాంకాలు గమనిస్తే ఆందోళనకరంగా ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లోని మద్యం వినియోదారుల్లో మహిళా మద్యం బానిసలు 1.4 శాతం ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 4.9 శాతం ఉండటం గమనార్హం.