Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: 2019లో అలీఘర్ ముస్లిం యూనివర్శిటీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ దేశద్రోహం కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థి, సామాజిక కార్యకర్త షార్జిల్ ఇమామ్‌కు బెయిల్ లభించింది. అలహాబాద్ హైకోర్టు శనివారం నాడు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఐపీసీ సెక్షన్ 124 ఏ(దేశద్రోహం), 153ఏ (మతం, జాతి విద్వేషాలను రెచ్చగొట్టడం, శతృత్వాన్ని ప్రోత్సహించడం), 153బీ (శాంతికి భంగం కలిగించే ప్రకటనలు చేయడం), 505(2) (భయపెట్టడం, తప్పుడు ఉద్దేశంతో ప్రకటనలు చేయడం) తదితర కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ, మణిపూర్, అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌ల్లోని జవహర్లాల్ యూనివర్శిటీకి చెందిన విద్యార్థులపై కూడా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అయితే, వారికి ఇదివరకే బెయిల్ లభించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో ఢిల్లీ కోర్టు ఇమామ్‌కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఉద్వేగ ప్రసంగంలో వాయిస్, ప్రవాహ వేగం రెండూ సమాజంలోని శాంతి భద్రతలు, సామరస్యాలపై ప్రభావాన్ని చూపే విధంగా ఉన్నాయంటూ కోర్టు బెయిల్‌ను నిరాకరించింది. ఢిల్లీ అల్లర్లకు సంబంధించి చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ ) చట్టం కేసులో కూడా ఇమామ్ పేరు ఉంది. నవంబర్ 2న జరిగిన విచారణలో ఇమామ్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది. ఇమామ్ శాంతిని ఆశించే పౌరుడనీ, ఎటువంటి నిరసనల్లోనూ, హింసలోనూ పాల్గనలేదని అతని తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.