Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది : ప్రతిపక్షాలు
అగర్తల : త్రిపురలో ఇటీవల జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన అధికార బీజేపీ అందుకు తగ్గట్లుగానే ఫలితాలను పొందింది. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ, ఉపసంహరణలు, ప్రచారం, పోలింగ్.. ఇలా ప్రతి దశలోనూ బీజేపీి గూండాలు హింసకు, దౌర్జన్యాలకు పాల్పడిన విషయం విదితమే. ఆదివారం ప్రకటించిన ఫలితాల్లో ప్రతిపక్ష పార్టీల సభ్యులను నామినేషన్ వేయకుండా అడ్డుకోవడంతో ఏడు పట్టణ స్థానిక సంస్థల్లో బీజేపీి ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఎన్నికలు జరిగిన 13 పట్టణ స్థానిక సంస్థలు, ఆరు నగర పంచాయతీల్లోనూ బీజేపీ గెలిచింది. రాష్ట్రరాజధాని అగర్తల మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న 51 కౌన్సిలర్ స్థానాల్లోనూ బీజేపీి గెలిచింది. 15 మంది సభ్యులున్న కోవాలి, 17 సీట్లు ఉన్న బెలోనియా, 15 మంది సభ్యులు ఉన్న కుమార్ఘాట్ మున్సిపల్ కౌన్సిల్లోనూ బీజేపీ మొత్తం స్థానాలు గెలిచింది. ధర్మనగర్, తెలైమురా, అమర్పూర్లోనూ బిజెపి గెలుపొందింది. అంబస్సా మున్సిపల్ కౌన్సిల్లో బీజేపీికి 12 స్థానాలు లభించగా, సీపీఐ(ఎం), టీఎంసీ, స్వతంత్ర అభ్యర్థులకు ఒక్కొక్క స్థానం లభించాయి. పానీసాగర్లోబీజేపీ 12 స్థానాలను గెలుచుకోగా, సీపీఐ(ఎం)కు ఒక స్థానం లభించింది.