Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు దేశాల ఈడీల సమన్వయంతో
ఇంటర్‌పోల్ ప్రత్యేక ఆపరేషన్
న్యూఢిల్లీ : ఆర్థిక నేరాల అణచివేతలో భాగంగా ఇంటర్‌పోల్ సమన్వయంతో వివిధ దేశాల్లోని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ఆర్థిక సైబర్ నేరాలకు పాల్పడుతున్న 1000 మంది నేరగాళ్లను అరెస్టు చేశాయి. దాదాపు 27 మిలియన్ డాలర్ల అక్రమ నిధులను సైతం అడ్డగించాయి. ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో పాలుపంచుకున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. 'హెచ్ఏఈసీహెచ్ఐ-2' కోడ్‌నేమ్‌తో కూడిన ఈ ఆపరేషన్ ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నాలుగు నెలల పాటు నిర్వహించబడింది. హాంకాంగ్, మకావుతో సహా 20 దేశాలకు చెందిన ప్రత్యేక పోలీసు విభాగాలు లైంగిక నేరాలు, మోసపూరిత పెట్టుబడులు, అక్రమ ఆన్లైన్ జూదంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ వంటి ఆర్థిక సైబర్ నేరాలను లక్ష్యంగా చేసుకొని నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయని ఇంటర్‌పోల్ తెలిపింది. ఈ ఆపరేషన్ ఫలితంగా 1,003 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. ఇది 1,660 కేసులను మూసివేయడంలో సహాయపడింది. అలాగే, ఆన్లైన్ ఆర్థిక నేరాల అక్రమ ఆదాయాలతో ముడిపడి ఉన్న 2,350 బ్యాంక్ ఖాతాలు బ్లాక్ చేయబడ్డాయి. ఇంటర్‌పోల్ సభ్య దేశాల భాగస్వామ్యంతో సైబర్-ఆధారిత ఆర్థిక నేరాలను పరిష్కరించడానికి ప్రారంభించిన మూడేండ్ల ప్రాజెక్ట్‌లో ఇది రెండవ ఆపరేషన్ అని సంబంధిత అధికారులు తెలిపారు.