Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాన్ బ్రిట్టాస్, సీపీఐ(ఎం) ఎంపీ
ప్రతిపక్షాల మాటవినడం ప్రభుత్వం నేర్చుకో వాలి. చట్టాల్లో చాలా అస్పష్టత ఉంటున్నది. చట్టాలను రూపొందించడం పట్ల విచారిస్తున్నా మని సుప్రీం కోర్టు సీజేఐ ఎన్వి రమణ విచారం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ను దేశం మొత్తం చూస్తోంది. మీడి యాను విస్మరించవద్దు. ఇది ప్రజాస్వామ్యానికి నాల్గవ స్తంభం, మీడియాపై ఉన్న ఆంక్షలను సడలించాలి. ''వ్యవసాయ బిల్లులు, పెగాసస్ అనే రెండు సమస్యలపై ప్రభుత్వం మొండి వైఖరి కారణంగా గత సమావేశాలు అసంపూర్తిగా ముగిశాయి. ఈ సమస్యలు ఏమయ్యాయో మనందరికీ తెలుసు. ఇవి అసంబద్ధమైన సమస్యలు అని మీరు చెప్పారు. కానీ పెగాసస్‌పై సుప్రీం కోర్ట్ తీర్పునిచ్చింది. ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. వ్యవసాయ చట్టాలను ప్రధాని మోడీ రద్దు చేస్తామని ప్రకటించారు. సభ్యుల ఆందోళనలను పరిష్కరించడంలో ప్రధాని, హౌం మంత్రి కొన్ని నిమిషాలు కేటాయించినట్టయితే, గత సమావేశాలు విజయవంతంగా ముగిసేవి'' . ''వ్యవసాయ సంక్షోభం నుంచి కోవిడ్ మూడవ తరంగం ముప్పు వరకు ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల వంటి అన్ని ప్రధాన సమస్యలపై చర్చలు జరగాలని కోరుకుంటున్నాం. దేశంలోని ప్రభుత్వ ఆస్తులను అమ్మడం, మైనారిటీలపై దాడులు చేయడం, సుప్రీం కోర్టు ఆదేశాలను దాటవేస్తూ సీబీఐ, ఈడీ డైరెక్టర్లు ఆర్డినెన్స్‌లు పొడిగించడం. కాశ్మీర్లో మిలిటెన్సీ, త్రిపురలో ప్రజాస్వామ్యానికి విఘాతం, పౌరుల గోప్యతకు రక్షణ. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని కోరుతున్నాం. విద్యుత్ సవరణ బిల్లు వంటి అనేక వివాదాస్పద బిల్లులను ప్రభుత్వం సమీక్షించాలి. లేదా ఉపసంహరించుకోవాలి. దయచేసి ఎంఎస్పీ చట్టం చేయాలి. కేరళ వరికి అత్యధిక మద్దతు ధర ఇస్తున్నది'' . ''బిల్లులు పార్లమెంటు పరిశీలనకు వెళ్లాలి. తగిన పరిశీలన కోసం స్టాండింగ్ కమిటీ, సెలెక్ట్ కమిటీకి పంపాలి. గతంలో 60-70 శాతం బిల్లులను కమిటీలకు రిఫర్ చేసేవారు. ఈ లోక్‌సభలో దాదాపు 10 శాతం బిల్లులు కూడా పంపలేదు. పార్లమెంటు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి. ఫెడరలిజంపై దాడి జరుగుతోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 భారతదేశం రాష్ట్రాల యూనియన్ అని చెబుతోంది. కానీ రాష్ట్రాల అధికారాలపై దాడి జరుగుతుంది. రాష్ట్ర జాబితా అంశాలపై దండయాత్ర చేస్తోంది. ఇది ఆగాలి''.