Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఈ సీజన్లో చివరి గింజ వరకు ధాన్యాన్ని కేంద్రమే కొంటుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేసారు. టీఆర్ఎస్ నేతల కోసమో, రాష్ట్ర ప్రభుత్వం కోసమో కాదనీ, తెలంగాణ రైతుల సంక్షేమం కోసం మొత్తం కొనుగోలు చేస్తామన్నారు. అన్ని రకాల రైస్‌ను సేకరిస్తామనీ, ఈ విషయంలో తెలంగాణ రైతులు ఆందోళన చెందవద్దన్నారు. హుజురాబాద్ తీర్పు తర్వాత ధాన్యం కొనుగోళ్ల పేరుతో కేంద్రంపై వ్యతిరేకత తెచ్చేలా టీఆర్ఎస్ సర్కార్ కుట్ర చేస్తున్నదనీ, రైతుల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. బాయిల్డ్ రైస్ పై రాష్ట్ర ప్రభుత్వంతో నాలుగేండ్లుగా కేంద్ర చర్చలు జరుపుతోందనీ, ఇందులో భాగంగా వచ్చే ఏడాది నుంచి బాయిల్డ్ రైస్ ఇవ్వమని రాష్ట్రం అంగీకరించిందన్నారు. కానీ, ఈ విషయంలో రైతుల్ని చైతన్య పరచడంలో, పంట మార్పు, విత్తనాలను సమకూర్చడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.