Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు ప్రాంతాలు నీటమునక
చెన్నై : తమిళనాడులో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జన జీవనం అస్తవ్యస్థమైంది. పలు ప్రాంతాలు నీట మునిగి, అంథకారంలో మగ్గుతున్నాయి. పలు బోట్ల ద్వారా వందలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రధాన ప్రాంతాల్లో వరదనీటితో ట్రాఫిక్ స్తంభించింది. విద్యుద్ఘాతంతో ఒక వ్యక్తి మరణించాడు. అయితే దక్షిణ అండమాన్ సముద్రం పైన మంగళవారం అల్ప పీడనం ఏర్పడే అవకాశం వుందని, ఇది మరింత బలపడి రాగల 48గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర, ఒడిషాల్లో డిసెంబరు 3 నుండి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ విభాగం తెలిపింది. పూండీ రిజర్వాయర్లోకి భారీగా వరదనీరు రావడంతో ఆదివారం సాయంత్రం అధికారులు పెద్దమొత్తంలో మిగులు నీటిని దిగువకు విడుదల చేశారు. చెన్నైలోని వరదరాజపురం సమీపంలోని వరద బాధిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి స్టాలిన్ పర్యటించారు.