Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తరప్రదేశ్, ఉత్తరఖండ్ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీ తీవ్ర విమర్శలు
లక్నో: దేశంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తుందని ఉత్తరప్రదేశ్, ఉత్తరఖండ్ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నరేంద్రమోడీ నేతృత్వంలో బీజేపీ 2024లో మళ్లీ అధికారంలో వస్తే.. రాజ్యాంగాన్ని మరుస్తుందనీ, దేశం నాశనమైపోందని పేర్కొన్నారు. అందుకే అన్ని పార్టీలు ఏకమై బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ జీర్ణించుకోలేకపోతుందని అన్నారు. అందుకే రాజ్యాంగాన్ని కూడా మార్చాలని చూస్తుందని వ్యాఖ్యానించారు. అయితే బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తే.. రాజ్యాంగంతో పాటు దేశాన్ని కూడా రక్షించినవాళ్లమవుతామని చెప్పారు. కానీ, బీజేపీ ఓడించాలంటే మాత్రం అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకంకావాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.