Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎలమారం కరీం, సీపీఐ(ఎం)ఎంపీ
ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం నిరంకుశ నిర్ణయమిది. ''ఎవరి మాట ప్రభుత్వం వినట్లేదు. చైర్మెన్, రాజ్యసభ సెక్రెటేరియట్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి మా మాట వినటంలేదు. గత సెషన్లో జరిగిన ఘటనపై ఇప్పుడు చర్యలా..? పార్లమెంట్ నిబంధనలకు విరుద్ధం. ప్రజల సమస్యలపైన గొంతెత్తిన ఎంపీలను సస్పెండ్ చేయడం అప్రజాస్వామ్యం.గత సమావేశాల్లో కార్మికుల సమ్మెపై నిషేధం బిల్లుపై మాట్లాడా. అలాగే ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా నిలదీశా. అపుడు మాట్లాడే అవకాశం కల్పించలేదు. గొంతు నొక్కే ప్రయత్నం చేసింది.పార్లమెంట్లో ప్రతిపక్షాల సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తాం.