Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: గడిచిన ఐదేండ్లలో ఆరు లక్షల మందికి పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఈ దిగ్భ్రాంతికరమైన విషయాన్ని కేంద్రం పార్లమెంట్లో ప్రకటించింది. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందిస్తూ పై వివరాలు వెల్లడించింది. కేంద్ర సహాయ మంత్రి నిత్యానంద్ రారు మంగళవారం నాడు లోక్సభకు వెల్లడించిన వివరాల ప్రకారం.. విదేశాల్లో 1,33,83,718 మంది భారతీయులు నివసిస్తున్నారు. అయితే, 2017లో 1,33,049 మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఇక 2018లో 1,34,561 మంది, 2019లో 1,44,017 మంది, 2020లో 85,248 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఈ ఏడాదిలో (2021) సెప్టెంబర్ 30,వరకు 1,11,287 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. మొత్తంగా ఐదేండ్లలో 6 లక్షల మందికి పైగా భారతీయులు పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఇదే సమయంలో కొత్తగా 4,177 మందికి భారత పౌరసత్వం ఇచ్చినట్టు మంత్రి నిత్యానంద్ రారు వెల్లడించారు.