Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒమిక్రాన్‌ను సహా కొత్త వేరియంట్లను
- భారతీయులు తట్టుకోగలరు
- వ్యాక్సినేషన్ పెంచడం, మాస్కులు ధరించడం ముఖ్యం: ప్రముఖ వైరాలజిస్ట్ షాహిద్ జమీల్
న్యూఢిల్లీ: అధిక శాతం భారతీయులు ఒమిక్రాన్ లేదు కరోనా మహమ్మారి మరేదైన కొత్త వేరియంట్‌ను తట్టుకోగల రక్షణ వ్యవస్థను కలిగివున్నారనీ, కొత్త వేరియంట్ల గురించి తీవ్ర భయాందోళనలు అవసరం లేదని ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ షాహిద్ జమీల్ అన్నారు. కరోనా మార్గదర్శకాలు పాటించాలనీ, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. అలాగే వ్యాక్సినేషన్‌ను సైతం ప్రభుత్వం వేగంగా పెంచాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు. ఇండియన్ సార్స్‌కోవ్-2 జెనోమిక్స్ కన్సార్టియా అడ్వైజరీ గ్రూప్ మాజీ చీఫ్ అయిన డాక్టర్ జమీల్.. కరోనా కొత్త వేరియంట్ల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. ''మనం జాగ్రత్తగా ఉండాలి. భయపడాల్సిన అవసరం లేదు.
డెల్టా వేరియంట్ కారణంగా భారత్ కరోనా సెకండ్‌వేవ్ రూపంలో అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఊహించినదాని కంటే ఎక్కువ మందికి సోకింది. దాదాపు 67 శాతం మంది భారతీయుల్లో యాంటీబాడీస్ ఉన్నట్టు నాల్గవ జాతీయ సెరో-సర్వే గణాంకాలు పేర్కొన్నాయి. టీకా స్థాయిలు తక్కువగా ఉన్నందున ఎక్కువ మంది ప్రభావితమయ్యారు'' అని జమీల్ తెలిపారు. ఇటీవల జరిపిన సర్వేల్లో ''ఢిల్లీలో 97 శాతం మందిలో, ముంబయిలో 85-90 శాతం మందిలో యాంటీబాడీస్ ఉన్నట్టు వెల్లడైంది. దీనికి అర్థం ఏమిటంటే అధిక సంఖ్యలో భారతీయులు ఒమిక్రాన్ లేదా ఏదైనా కరోనా వేరియంట్ల నుంచి పొంచివున్న ముప్పు నుంచి రక్షణ కలిగివుండటం'' అని అన్నారు.కాగా, కొత్తగా వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్లో అధిక మొత్తంలో స్పైక్ మ్యుటేషన్లు ఉన్నాయనీ,ఇది టీకాలను తట్టుకునే సామర్థ్యం కలిగివుంటుందనే అంచనాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి.అయితే,ఒమిక్రాన్‌ను సంబంధించిన పూర్తి డేటా ఇంకా అందుబాటులో లేదనీ,అయితే,ఈ వేరియంట్‌కు వ్యతిరేకంగా ప్రస్తుతమున్న టీకాల పాయింట్లు కొంత తగ్గవచ్చు కానీ, వ్యాక్సిన్లు పూర్తిగా నిరుపయోగం కావని డాక్టర్ జమీల్ అంచనా వేశారు.