Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్
న్యూఢిల్లీ : రైతు ఉద్యమంలో మరణించిన రైతులు, అలాగే రైతులపై పెట్టిన కేసుల వివరాలు తమ వద్ద లేవని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. లోక్సభలో ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్ర మంత్రిత్వ శాఖ వద్ద మరణించిన రైతుల వివరాలు, అలాగే రైతులపై బనాయించిన కేసుల వివరాల రికార్డులేదని స్పష్టం చేశారు.
గత మూడేండ్లలో 1,39,045 మంది దళితులపై దాడుల కేసులు
యూపీది అగ్రస్థానం
దేశంలో గత మూడేండ్లలో 1,39,045 మంది దళితులపై దాడుల కేసులు నమోదయ్యాయని కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి అజరు కుమార్ మిశ్రా తెలిపారు. లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా 2018లో దళితులపై 42,793, 2019లో 45,961, 2020లో 50,291 దాడుల కేసులు నమోదు అయ్యాయనీ తెలిపారు. తెలంగాణలో 2018లో 1,507, 2019లో 1,690, 2020లో 1,959 కేసులు నమోదయ్యాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో దళితులపై 2018లో 1,836, 2019లో 2,071, 2020లో 1,950 దాడుల కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. దళితులపై దాడుల్లో ఉత్తరప్రదేశ్ అగ్రభాగాన ఉంది. 2018లో 11,924, 2019లో 11,829, 2020లో 12,714 కేసులు నమోదు అయ్యాయి.
దేశంలో 151 పోలీస్ కస్టడీ మరణాలు
దేశంలో 151 మంది పోలీస్ కస్టడీలో మరణాలు సంభవించాయని కేంద్ర హౌం సహాయ శాఖ మంత్రి నిత్యానంద్ రారు తెలిపారు. లోక్సభలో కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో నవంబర్ 15 నాటికి 151 మంది పోలీస్ కస్టడీలోనే మరణించారని తెలిపారు.