Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఉన్న ఓ చర్చిని హిందుత్వ గ్రూపునకు చెందిన పలువురు సభ్యులు ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకెళ్తే.. ద్వారక ప్రాంతంలోని చర్చిని ఆదివారం హిందూత్వ గ్రూపు భజరంగ్ దళ్ సభ్యులు ధ్వంసం చేశారని మిలీనియం పోస్ట్ నివేదించింది. ఇటీవలే ప్రారంభమైన ఈ చర్చిలో మొదటి ఆదివారం ప్రార్థనలు జరుగుతున్నప్పుడు ఈ దాడి జరిగింది. 'నవంబర్ 28 ఉదయం 9.30 గంటలకు మటియాలా రోడ్లో ఉన్న చర్చి వద్ద గొడవ జరిగిందని పోలీసులకు సమాచారం అందింది'' అని ఒక పోలీసు అధికారి వెల్లడించారు. చర్చిబోర్డును ధ్వంసం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్నామనీ, ఒకరిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.