Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోని ఎన్‌కౌంటర్‌పై నిష్పాక్షికంగా దర్యాప్తు జరపాలి
- సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో డిమాండ్
న్యూఢిల్లీ : బెదిరింపులను ఆపి, లోని ఎన్‌కౌంటర్‌పై నిష్పాక్షికంగా దర్యాప్తు నిర్వహించాలని సీపీఐ(ఎం)పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది. ఘజియాబాద్ జిల్లాలోనిలోని ప్రాంత బీజేపీ ఎమ్మెల్యే చేస్తున్న తప్పుడు,దురుద్దేశపూరిత ఆరోపణలను పొలిట్‌బ్యూరో ఖండించింది. పొలిట్‌బ్యూరో సభ్యురా లు బృందా కరత్ మత సామరస్యతకు విఘాతం కలిగించేలా గో వధను ప్రోత్సహిస్తున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యే అవాకులు చవాకులు పేలడంపై పొలిట్‌బ్యూరో తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా పోలీసులపై ఒత్తిడి తేవడానికి ఎంఎల్ఏ ప్రయత్నిస్తున్నారని విమర్శించిం ది. లోనిలో ఇటీవల జరిగిన పోలీసుల దాడులకు గురైన కుటుంబాలను బృందా కరత్ నేతృత్వంలోని సీపీఐ(ఎం)ప్రతినిధి బృందం పరామర్శించింది. ఏడుగురు యువకులపై పోలీసులు దాడి జరిపి ఒకే రీతిలో గాయపరిచారు.బాధితులందరూ ముస్లిము లే. అయితే, గాయపరిచిన పోలీసులపై కేసులు నమోదు చేయడానికి బదులు బాధితులనే లాకప్‌లో పడేశారు. పోలీసు చర్యకు మద్దతుగా ఎంఎల్ఏ నేతృత్వంలో విజిలెంట్ గ్రూపులు ఇప్పుడు బాధితులకు మద్దతుగా నిలిచిన వారిని బెదిరించడం, అడ్డగించడం వంటి చర్యలకు పాల్పడుతున్నాయని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ముందుగా లోని ఎన్‌కౌంటర్‌పై నిష్పాక్షికంగా దర్యాప్తు జరగాలన్న డిమాండ్‌ను సీపీఐ(ఎం) పునరుద్ఘాటించింది. న్యాయాన్ని అందకుండా దెబ్బతీస్తున్న వారందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.