Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేట్ కంపెనీల ఆదాయాన్ని దెబ్బకొట్టిన జీఎస్టీ
- తీవ్ర ప్రభావం చూపిన నోట్లరద్దు, జీఎస్టీ, కోవిడ్-19 : ఆర్థిక నిపుణులు
న్యూఢిల్లీ : గత ఆరేండ్లలో ముఖ్యంగా నోట్లరద్దు, జీఎస్టీ తర్వాత దేశవ్యాప్తంగా వర్తకవాణిజ్యం దారుణంగా దెబ్బతిన్నాయి. కోవిడ్-19 సంక్షోభం దెబ్బతో చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు పెద్ద సంఖ్యలో మూత పడ్డాయి. అందువల్లే గత కొంతకాలంగా దేశంలో నిరు ద్యోగం రికార్డుస్థాయికి పెరిగింది. ఈ ఏడాది మేలో సగ టు నిరుద్యోగరేటు 12శాతంగా ఉంది. గత ఆరేండ్లలో దేశంలో 5,00,506 ప్రయివేట్ కంపెనీలు మూతప డ్డాయని ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర మంత్రి(కార్పొరేట్ సంబంధాలు) ఇంద్రజిత్ సింగ్ వెల్లడించారు. రాష్ట్రాల వారీగా మూతపడిన కంపెనీల సంఖ్య ఈవిధంగా ఉంది. మహారాష్ట్రలో 81,412, ఢిల్లీలో-55,753, పశ్చిమ బెంగాల్లో 33,938, కర్నాటకలో 27,502 కంపెనీలు మూతపడ్డాయి. చండీ గఢ్, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లలో 64,449 కంపెనీలు మూతపడ్డాయి. టెక్స్ టైల్స్, గార్మెంట్స్, చేతివృత్తులు, క్రీడలు, వస్తువులు.. రంగాలకుచెందిన కంపెనీలుఎక్కువగా ప్రభావిత మయ్యాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలు, ముఖ్యంగా నోట్లరద్దు, జీఎస్టీ తీవ్రంగా ప్రభావితం చేశాయని, బడా కార్పొరేట్లకు పన్ను ప్రయోజనాలు ఇచ్చిన మోడీ సర్కార్, చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తులపై భారీ పన్నులు వేసిందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. కంపెనీ నిర్వహణ భారం గా మారటం, దేశీయంగా మార్కెట్ ప్రభావితం కావటం తో అనేక కంపెనీలు మూతపడినట్టు తెలుస్తోంది. జీఎస్టీ చట్టాన్ని తీసుకొచ్చిన 2017-18 మధ్యకాలంలో ఎక్కువ సంఖ్యలో కంపెనీలు మూతపడ్డాయి. ఢిల్లీలో మూతపడిన కంపెనీల సంఖ్య ఎప్పుడూ కూడా 3వేలు దాటలేదు. అయితే 2017-18 ఆర్థిక సంవత్సరంలో 45,581 కం పెనీలు మూతపడటం గమనార్హం. గుజరాత్‌లోనూ ఇలా గే జరిగింది. జీఎస్టీ రాకముందు ఈ రాష్ట్రంలో గరిష్టంగా మూతపడిన కంపెనీల సంఖ్య 1585. జీఎస్టీ అమల్లోకి వచ్చిన ఏడాదిలో 11,973కంపెనీలు మూతపడ్డాయి.ప్రయివేటు కంపెనీలు ఇలా ఒక్కసారిగా ఎందుకు మూతపడ్డాయి? అనేందుకు రకరకాల కారణాలున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గత కొన్నేండ్లుగా వందల సంఖ్యలో ప్రయివేటు కంపెనీలు మూతపడుతున్నాయని, నోట్లరద్దు, జీఎస్టీ తర్వాత వాటి రెవెన్యూ దారుణంగా పడిపోయిందని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ సీనియర్ అధికారులు కొంతమంది మీడియాకు వెల్లడించారు. ఇక కరోనా సంక్షోభ ప్రభావం ఎంతన్నది ఈ ఆర్థిక సంవత్సరం ముగిస్తేగానీ చెప్పలేమని వారు అన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న కంపెనీలు ఎక్కువ సంఖ్యల మూతపడినట్టు తెలుస్తోంది. వస్త్ర పరిశ్రమ, గార్మెంట్స్, చేతివృత్తులు, క్రీడా వస్తువులు..మొదలైన కంపెనీల్లో పనిచేసినవారు ఎక్కువ సంఖ్యలో నిరుద్యోగులుగా మారారు.