Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత బ్యాంక్‌లకు దాదాపుగా రూ.9వేల కోట్లకు పైగా ఎగనామం పెట్టి బ్రిటన్ పారిపోయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ మాల్యాకు సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరిక చేసింది. ఇక మాల్యాను బ్రిటన్ నుంచి రప్పించేందుకు వేచి ఉండలేమని మంగళవారం స్పష్టం చేసింది. 2022 జనవరి 18న మాల్యాకు విధించే శిక్షను ఖరారు చేయనున్నట్టు సంకేతాలు ఇచ్చింది. మాల్యా వ్యక్తిగతంగా హాజరుకావాలని లేదా అతని న్యాయవాది ద్వారా వాదనలను వినిపించాలని న్యాయమూర్తి లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం కోరింది. మాల్యా కోర్టు ధిక్కార కేసును జనవరి 18న విచారిస్తామని తెలిపింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి మాల్యా తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లు (రూ.300 కోట్లు) బదిలీ చేసి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు. 2017లో కోర్టును ధిక్కరించారని కోర్టు గుర్తించింది. ధిక్కరణలో భాగంగా గత నాలుగు నెలల నుంచి శిక్ష ఖరారు మాత్రమే పెండింగ్‌లో ఉంది. బ్రిటన్ నుంచి మాల్యాను భారత్‌కు రప్పించే అంశం తుది అంకానికి చేరుకుందని కేంద్రం కోర్టుకు తెలిపింది . కాగా విజయ మాల్యా భారత్‌కు వచ్చే విషయంపై స్పష్టత లేదు.