Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్సీపీ అధినేత శరద పవార్ ఆకాంక్ష
ముంబయి : ప్రజల పురోభివృద్ధి కోసం ప్రజాతంత్ర విలువలను కాపాడేదిశగా ఐక్య వేదికలను బలోపేతం చేయాల్సిన అవసరముందని నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ బుధవారం ముంబయిలోని పవార్ నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవార్ ట్వీట్ చేశారు. 'మమత బెనర్జీ భేటీ కావడం సంతోషదాయకం. అనేక అంశాలు చర్చించాం. ప్రజాతంత్ర విలువలు పరిరక్షించేందుకు ఐక్య ప్రయత్నాలను బలోపేతం చేయాల్సిన అవసరముందని ఇరువురం అంగీకరించాం' అని ఆయన తెలిపారు. భేటీ అనంతరం మమత బెనర్జీ మాట్లాడుతూ దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై పవార్‌తో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలన్న తమ ప్రాధమ్యాలను పునరుచ్చరణ చేసుకున్నట్లు పేర్కొన్నారు. యుపిఎ లాంటిదేదీ ప్రస్తుతం ఉనికిలో లేదని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఆమె చెప్పారు.