Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మావోయిస్టు సిద్ధాంతాలకు దూరంగా ఉంటూ.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై కోబాడ్ గాంధీను నిషేధిత సీపీఐ(మావోయిస్టు) బహిష్కరించింది. ప్రస్తుతం ఆయన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా వ్యవహరిస్తుండగా.. కేంద్ర కమిటీ మాజీ సభ్యులుగా కూడా ఉన్నారు. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి అభరు పేరుతో నవంబర్ 27 తేదీతో ఉన్న ప్రకటన వెలువడింది. 2019లో జైలు నుండి విడుదలైన తర్వాత గాంధీ రాసిన 'ఫ్రాక్చర్డ్ ఫ్రీడమ్-ఎ ప్రిజన్ మెమోయిర్' పుస్తకంలో మావోయిస్టు ఉద్యమాన్ని తప్పుగా చూపించారని తెలిపింది. ' మార్క్సిజం-లెనినిజం-మావోయిస్టు సిద్ధాంతాలను విడిచిపెట్టి.. ఆదర్శవాదం, ఆధ్మాత్మికం వంటి బూర్జువా ఆలోచనలు అనుసరిస్తున్నందున 70 ఏండ్ల గాంధీని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం' అని పార్టీ పేర్కొంది.