Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ సంస్థ గూగుల్ భారత మహిళలకు ఆర్థిక సహకారాన్ని అందించేందుకు ఓ స్కాలర్షిప్ను తీసుకువచ్చింది. 'జనరేషన్ గూగుల్ స్కాలర్షిప్' పేరిట ఈ సహకారాన్ని ఇవ్వనుంది. దీనికి కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ విభాగాల్లో డిగ్రీ ప్రోగ్రామ్‌లు చేస్తున్న మహిళలు అర్హులు. భారత విద్యార్థినులు 'ఆసియా పసిఫిక్' కేటగిరీ కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారికి 2022 - 2023 సంవత్సరంలో 1000 డాలర్ల స్కాలర్షిప్ లభిస్తుంది.
అర్హత: ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఏదేని ఆసియా పసిఫిక్ దేశంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ప్రవేశం పొంది ఉండాలి. కంప్యూటర్ ఇంజనీరింగ్/ కంప్యూటర్ సైన్స్/ తత్సమాన సాంకేతిక విభాగాలకు సంబంధించిన డిగ్రీ కోర్సులు ఎంచుకొని ఉండాలి. స్కూల్ స్థాయి నుంచి మంచి అకడమిక్ రికార్డ్ తప్పనిసరి. నాయకత్వ లక్షణాలు ఉండాలి. కంప్యూటర్లపై ప్రాథమిక అవగాహన కూడా లేనివారికి అవసరమైన పరిజ్ఞానాన్ని అందించడంలో ఆసక్తి ఉండాలి. టెక్నికల్ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన నైపుణ్యాలు ఉండాలి.
ఎంపిక: వచ్చిన దరఖాస్తులు పరిశీలించి అకడమిక్ ప్రతిభ, సఅజనాత్మకత, సాంకేతిక నైపుణ్యం తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 10