Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఎట్టకేలకు వ్యవసాయ చట్టాలకు తెరపడింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈచట్టాల రద్దుకు సంబంధించిన బిల్లును ఆమోదించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ అన్నదాతలు చేపడుతున్న ఆందోళనలకు ప్రతిఫలం లభించినట్లయింది. దీంతో రద్దు ప్రక్రియ పూర్తయ్యింది. ఈ చట్టాలను రద్దు చేస్తూ రూపొందించిన బిల్లు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తొలి రోజైన సోమవారం ఇరు సభల్లో ఆమోదం పొందిన సంగతి విదితమే. ఎలాంటి చర్చ లేకుండానే బిల్లు ఆమోదం పొందింది. కాగా, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే వీటిని మోడీ సర్కార్ ఉపసంహరించుకుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.