Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 9 కోట్ల బ్యాంకు ఖాతాల్లో 26,697 కోట్లు
- వారసులను గుర్తించాలంటూ సూచనలు
న్యూఢిల్లీ : దేశంలోని అన్ని బ్యాంకుల్లో వినియోగం లేని ఖాతాల్లో రూ.26,697 కోట్లు మగ్గుతున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. బుధవారం మంగళవారం రాజ్యసభ సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ 2020 ముగింపు నాటికి 9 కోట్ల ఖాతాల్లో ఈ మొత్తం వినియోగం లేకుండా ఉందని తెలిపారు. ఈ ఖాతాలు దాదాపు పదేండ్ల నుంచీ నిర్వహణలో లేవని తెలిపారు. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల్లో రూ.24,356 కోట్లు, అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకుల్లో రూ.2,341 కోట్లు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో రూ.0.71 కోట్లు చొప్పున ఈ మొత్తం ఉందన్నారు.