Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిమాండ్‌ను అందుకోవడంలో 'ఉపాధి హామీ' విఫలం
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంఎన్ఆర్ఈజీఏ) పని డిమాండ్‌ను అందుకోవడంతో విఫలమైందని అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి. మరీ ముఖ్యంగా ఎంఎన్ఆర్ఈజీఏ కింద డిమాండ్ చేసిన పని, కల్పించిన పని మధ్య అంతరం నవంబర్‌లో ఆల్ టైమ్ గరిష్టానికి చేరింది. అక్టోబర్‌తో పోలిస్తే నవంబర్‌లో 22.23 కోట్ల వ్యక్తిగత రోజులకు వ్యతిరేకంగా నవంబర్ 30, 2021 నాటికి కేవలం 11.66 కోట్ల వ్యక్తిగత రోజుల పని మాత్రమే కల్పించబడింది. ఇయర్ బేసిస్ ప్రకారం.. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉత్పన్నమైన వ్యక్తిగత పని దినాలు 2020 నవంబరులో 23.58 కోట్ల వుండగా, అందులో ప్రస్తుతం 50.5 శాతానికి పడిపోయింది. 2019 నవంబరులో ఉత్పత్తి చేయబడిన కోవిడ్ ముందు కాలంలో కూడా 16.92 కోట్లుగా వుంది. ఈ పథకం కింద పని డిమాండ్ చేసిన వ్యక్తుల సంఖ్య 1.92 కోట్లు ఉంది. ఇక అక్టోబర్‌లో 2.60 కోట్లకు వ్యతిరేకంగా నవంబర్‌లో 2.62 కోట్ల మంది వ్యక్తులు ఉపాధి హామీ కింద పని డిమాండ్ చేసినట్టు అధికారిక డేటా చూపిస్తోంది. నవంబర్‌లో పని డిమాండ్ చేసిన కుటుంబాలు అక్టోబర్‌లో 2.07 కోట్లకు వ్యతిరేకంగా 2.10 కోట్లుగా ఉంది. అయితే, డేటా తర్వాతి నెల వచ్చే వరకు రోజు తర్వాతి రోజు అప్ డేట్ చేయబడుతుంది. ప్రస్తుత పరిస్థితులకు ప్రధాన కారణం నిధుల కొరత అని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, 2020 లాక్డౌన్ కారణంగా గ్రామాలకు చేరిన అనేక మంది ఇప్పటికీ వలసదారులు అక్కడే ఉన్నారనీ, లాక్డౌన్ ముందు ఉపాధి పొందిన ప్రాంతాలకు తిరిగి రాలేదని కూడా పలువురు పేర్కొంటున్నారు. ''పంట కోత అనంతర సీజన్లో ఉపాధి హామీ పథకం కింద పనికి ఖచ్చితంగా కొత్త డిమాండ్ ఉంది, కానీ నిధులు మాత్రం మందగించాయి. దీనికి ప్రధాన కారణాల్లో రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఈ పథక నిధులు లేకపోవడం వల్ల జరిగివుండవచ్చు. సప్లిమెంటరీ కేటాయింపులను పార్లమెంట్ ఆమోదించే వరకు వారు కొత్త అభ్యర్థనలు ఉంచడానికి ఇష్టపడకపోవచ్చు'' అని కార్మిక రంగ నిపుణులు కెఆర్ శ్యామ్ సుందర్ అన్నారు.