Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఐడిఎఫ్సి ఎస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) లిమిటెడ్ తమ సీనియర్ ఫండ్ మేనేజర్ గౌతమ్ కౌల్‌ను ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్ మేనేజ్మెంట్ బందంలో తీసుకున్నట్టు తెలిపింది. కచ్చిత ఆదాయ వ్యూహాలలో గౌతమ్‌కు 20 ఏండ్లకు పైగా అనుభవం ఉన్నదని పేర్కొంది. గతంలో ఆయన రూ.27 వేల కోట్ల ఆస్తులను యాక్టివ్, పాసివ్ వ్యూహాలను నిర్వహించారు. ఐడీఎఫ్సీ ఏఎంసీ కుటుంబంలోకి గౌతమ్‌ను సాదరంగా ఆహ్వానిస్తున్నామని ఆ సంస్థ ఫిక్స్డ్ ఇన్కమ్ హెడ్ సుయాష్ చౌదరి పేర్కొన్నారు. 2000లో ఆవిర్బవించిన ఈ సంస్థ అక్టోబర్ 2021 నాటికి రూ.1,27,000 కోట్ల ఎయుఎంను కలిగి ఉంది.