Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కత్తితో పొడిచి చంపిన దుండగులు
- ఆరెస్సెస్ పనే..సమగ్ర విచారణ జరపాలి : సీపీఐ(ఎం) డిమాండ్
తిరువనంతపురం : కేరళలో సీపీఐ(ఎం) నాయకుడు హత్యకు గురయ్యాడు. దుండగులు ఆయనను కత్తితో పొడిచి చంపారు. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. మృతుడు సందీప్ కుమార్ పతనంథిట్ట జిల్లాలోని పెరింగర గ్రామవాసి. ఈయన సీపీఐ(ఎం) స్థానిక కార్యదర్శిగా ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరువల్లలో ఈ ఘటన జరిగింది. ఒక దుకాణ యజమాని, నిందితులకు మధ్య గొడవను పరిష్కరించడానికి సందీప్ ప్రయత్నించాడు. అయితే, తాగిన మైకంలో ఉన్న నిందితులు సందీప్‌పై ఎదురుతిరిగారు. ఆయన వాహనాన్ని వెంబడించారు. ఆ తర్వాత వారు సందీప్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. మృతుడి శరీరంపై 11 కత్తి గాయాలున్నాయి. అయితే, ఆస్పత్రికి తరలించే క్రమంలోనే సందీప్ ప్రాణాలు కోల్పోయాడు.ఈ ఘటనపై సీపీఐ(ఎం) స్పందించింది. ఇది ఆరెస్సెస్ చర్య అని ఆరోపించింది. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ హత్యోదంతంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది.