Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెండింగ్ డిమాండ్లపై రైతు ఉద్యమం కొనసాగుతుంది .ఎస్కేఎం
న్యూఢిల్లీ : కేంద్రం నుంచి అధికారికంగా ఎలాంటి హామీ రాకపోవడంతో ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్ల కోసం రైతులు పోరాటం కొనసాగిస్తున్నారని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) స్పష్టం చేసింది. రైతు ఉద్యమం ముగియాలంటే, ముందస్తు షరతుగా ఆరు కీలక డిమాండ్లను లేవనెత్తిన ఎస్కేఎం... ప్రధానమంత్రికి లేఖ రాసిందనీ, కానీ ఇప్పటి వరకు లేఖకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రాలేదని ఎస్కేఎం పేర్కొంది. ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్న ఆందోళన శిబిరాలకు వందలాది మంది రైతులు చేరుకుంటున్నారని తెలిపింది. ఢిల్లీ సరిహద్దులతో సహా పదుల సంఖ్యల్లో శాశ్వత ఉద్యమ శిబిరాలు కొనసాగుతున్నాయని తెలిపింది. ఇది రైతలు క్రమశిక్షణ, సంకల్పాన్ని స్పష్టం చేస్తుందని పేర్కొంది. ప్రధాని మోడీకి ఎస్కేఎం రాసిన లేఖలో పేర్కొన్న ఆరు అంశాల్లో రైతులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవడం ఒకటని పేర్కొంది. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరప్రదేశ్,ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లలో వేలాది మంది రైతులపై వందలాది తప్పుడు కేసులు నమోదయ్యాయనీ,ఇది కేవలం హర్యానా కేసులే కాదు, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా కేసులను కూడా గమనించాలని స్పష్టం చేసింది.ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రైతుల సమస్యలను పరిష్కరించాలని బీజేపీ నేతలు స్వయంగా యోగి ప్రభుత్వంపైఒత్తిడి తెస్తున్నారని పేర్కొంది.ఉత్తరప్ర దేశ్ ముఖ్యమంత్రికి వీడియో సందేశంలో యూపీ ఎమ్మెల్యే రోమి షాహనీ చెరకు రైతులకు పెండిం గ్లో ఉన్న బకాయి లు చెల్లించాలని విజ్ఞప్తి చేశారని స్పష్టం చేసింది.అపరిష్కృత సమస్యలపై చర్చించేందుకు రాష్ట్రంలోని రైతు నేతలను ఆహ్వానిస్తానని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ చెప్పారని, బీజేపీ నాయకులు,దాని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సూచన కోసం ఎదురు చూస్తున్నా యని ఎస్కేఎం పేర్కొంది.అందువల్ల పెండింగ్‌లో ఉన్న డిమాండ్లపై త్వరగా తేల్చడం కేంద్ర ప్రభుత్వ బాధ్యతని స్పష్టం చేసింది. రైతు ఉద్యమం కోసం మరో రైతు గిరిరాజ్ సంత్ తన జీవితాన్ని త్యాగం చేశారు. కెఎంపి-కేజీపీ ఇంటర్‌ఛేంజ్ సమీపంలోని ఆందోళన శిబిరం వద్ద అతను గత సంవత్సరం నుంచి నిరసనలో భాగస్వామ్యం అయ్యాడు .ఉద్యమ అమరవీరుల బంధువులకు పునరావాసం కల్పించా లనే దాని డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందని ఎస్కేఎం ఎదురుచూస్తూనే ఉందని తెలిపింది. భోపాల్ (దుర్ఘటన) కార్పొరేట్ విపత్తులో బాధితులు, ప్రాణాలతో బయటపడిన వారికి ఎస్కేఎం సంఘీభావం తెలిపింది.