Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగర్తల : త్రిపుర స్టేట్ రైఫిల్స్ (టిఎస్ఆర్) చెందిన ఒక జవాను తన సహచరులు ఇద్దర్ని కాల్చిచంపాడు. ఈ దారుణం సెపహిజల జిల్లాలోని ఒక ఒఎన్జిసి గ్యాస్ డ్రిల్లింగ్ కేంద్రం వద్ద శనివారం చోటు చేసుకుంది. ఉదయం 9 గంటల ప్రాంతంలో జవాను సుకాంత దాస్ జరిపిన కాల్పుల్లో సుబెదార్ మార్కా సింగ్ జమాతియా అక్కడిక్కడే మరణించగా, నైబ్ సుబెదార్ కిరణ్ జమాతియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని త్రిపుర పోలీసులు తెలిపారు.