Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించనున్న కేరళ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కెకె శైలజా
న్యూఢిల్లీ : భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) నేషనల్ గర్ల్స్ కన్వెన్షన్ ఈ నెల 17నుంచి మూడు రోజుల పాటు జరగను న్నాయి.రాజస్థాన్‌లోని సికార్‌లో 17 నుంచి 19వరకు జరిగే ఈ కన్వన్షన్ను కేరళ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కెకె శైలజా ప్రారంభించ నున్నారు.మూడు రోజుల పాటు జరిగే సమావేశాల్లో దేశంలోని విద్యార్థినీల సమస్యలు, విద్యా రంగంలో సమస్యలపై చర్చించనున్నారు. అలాగే విద్యార్థినీల్లో ఎస్ఎఫ్ఐ బలోపేతం, చేసిన ఉద్యమాలపై సమీక్షించనున్నట్టు ఎస్ఎఫ్ఐ గర్ల్స్ జాతీయ కన్వీనర్ దీప్షితాదార్ తెలిపారు. మోడీ సర్కార్ వచ్చిన తరువాత విద్యా రంగాన్ని సర్వనాశనం చేసే విధానాలు అమలు చేస్తున్నారని, నూతన విద్యా విధానంతో విద్యాను కేంద్రీకరించేందుకు చూస్తున్నారని విమర్శించారు. మోడీ సర్కార్ విద్యా వ్యతిరేక విధానాలపై భవిష్యత్ పోరాటాలకు కన్వెన్షన్ పిలుపు ఇస్తుందని అన్నారు. ఈ కన్వెన్షన్‌లో దేశవ్యాప్తంగా వందలాది మంది ప్రతినిధులు పాల్గొంటారని, ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ విధానాలు, విద్యార్థినీలు ఎదుర్కొంటున్న సమస్యలపై కన్వెన్షన్ ముందుకు తీసుకొస్తారని చెప్పారు. ఎస్ఎఫ్ఐ మాజీ నేత పన్నాలాల్ అధ్యక్షుడు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి సుభాష్ జాఖర్ 141 మందితో ఆహ్వాన సంఘం వేసినట్లు దీప్షితా దార్ తెలిపారు.