Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయి,గుజరాత్‌ల్లో...
వదోదరా: దేశంలో కర్నాటక తర్వాత, ఇప్పుడు గుజరాత్, ముంబయిలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ముంబయిలో 33 ఏండ్ల వ్యక్తికి, గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 72 ఏండ్ల మరో వ్యక్తిని గుర్తించారు. ఇటీవల జింబాబ్వే నుంచి జామ్‌నగర్‌కు తిరిగి వచ్చిన అతనికి, దక్షిణాఫ్రికా నుంచి ముంబయికి వచ్చిన వ్యక్తికి పరీక్షలు జరపగా ఒమిక్రాన్ సోకినట్టు తేలింది. వారిద్దరికి కరోనా పరీక్ష చేయగా.. అతని నమూనా పాజిటివ్‌గా గుర్తించారు.ఆ తర్వాత పూణేలోని జీనోమ్ సీక్వెన్సింగ్ నివేదికలో.. అతను కొత్త వేరియంట్ బారిన పడినట్టు బయటకువచ్చింది.రోగిని ఐసోలేషన్ వార్డులో చేర్చారు. అతనితో పరిచయం ఉన్న వ్యక్తులను గుర్తిస్తున్నారు. దేశంలో ఇప్పుడు మూడు కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి.