Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిట్‌కాయిన్ 17 శాతం క్షీణత
న్యూఢిల్లీ : భారత్‌లో క్రిప్టో కరెన్సీల చెలామణిపై సందిగ్దత నెలకొనడంతో ఈ వర్చూవల్ కరెన్సీలు దారుణపతనాన్ని చవి చూశాయి. బిట్ కాయిన్ లాంటి వాటిపట్ల భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఆందోళనల మధ్య గ్లోబల్ క్రిప్టో కరెన్సీలు భారీ నష్టాలను చవి చూస్తున్నాయి. శుక్ర, శనివారాల్లోని 24 గంటల కాలంలోనే బిట్ కాయిన్ ఏకంగా 17 శాతం లేదా 10వేల డాలర్లు (రూ.7.5 లక్షలు) కోల్పోయింది. శుక్రవారం ఉదయం 57వేల డాలర్ల (రూ.43 లక్షలు)గా ఉన్న బిట్ కాయిన్ విలువ శనివారం ముగింపు నాటికి 17 శాతం క్షీణించి 47 బిలియన్ డాలర్ల (రూ.35 లక్షలు)కు పతనమయ్యింది. ఓ దశలో ప్రపంచ మార్కెట్లో ఈ వర్చూవల్ కరెన్సీ విలువ 43వేల డాలర్ల(రూ.32.25 లక్షలు) కనిష్టానికి పడిపోయింది.