Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జైపూర్: ఐదుగురు కూతుళ్లతో కలిసి తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషాదకర ఘటన రాజస్థాన్లోని కోటా పరిధిలోని కల్యాఖేడి గ్రామంలో చోటు చేసుకున్నది. తల్లితో పాటు ఐదుగురు ఆడ పిల్లలు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బావిలో నుంచి బయటకు తీశారు. దీనిపై కేసు నమోదుచేసుకుని ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. స్థానికుల వివరాల ప్రకారం.. బాదం దేవి అనే మహిళ భర్త శివలాల్తో గొడవలు ఉన్నాయనీ, ఈ క్రమంలోనే గత గురువారం ఆమె ఏడుగురు కూతుళ్లతో కలిసి ఇల్లు వదిలి వెళ్లింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఉదయం గ్రామంలోని ఓ బావిలో బాలిక మృతదేహం తేలడంతో ఈ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత తల్లితో పాటు మరో నలుగురు బాలికల మృత దేహాలను బావిలోంచి బయటకు తీశారు. అయితే, మరో ఇద్దరు బాలికలు మాత్రం బావి వద్ద కనిపించారు. ఐదుగురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా దిగ్భ్రాంతి గురి చేసింది. కుటుంబ సమస్యలతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతున్నదని తెలిపారు.