Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్యకర్తలకు ఫరూక్ అబ్దుల్లా పిలుపు
శ్రీనగర్ : కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేలా మహోద్యమం సాగిస్తున్న అన్నదాతల తరహాలో పోరాడేందుకు సిద్ధం కావాలని పార్టీ కార్యకర్తలకు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) అధ్యక్షులు ఫరూక్ అబ్దుల్లా పిలుపునిచ్చారు. షేక్ మహ్మద్ అబ్దుల్లా 116వ జయంతి సందర్భంగా శ్రీనగర్‌లోని హజరత్బల్ ప్రాంతంలో ఉన్న ఆయన స్మారకం వద్ద ఆదివారం జరిగిన సభలో కార్యకర్తలను ఉద్దేశించి ఫరూఖ్ అబ్దుల్లా ప్రసంగించారు. కేంద్రం లాగేసుకున్న హక్కులను తిరిగి పొందేందుకు రైతుల తరహాలోనే త్యాగాలు చేయాల్సిన అవసరం రావచ్చునని, అన్నదాతల మాదిరి మహోద్యమానికి సిద్ధంగా ఉండాలని అబ్దుల్లా పిలుపునిచ్చారు.