Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొల్కతా : ఒడిషా, పశ్చిమ బెంగాల్లోని తీర ప్రాంత జిల్లాల్లో జావద్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒడిషాలోని గంజాం, ఖుద్రా, కెండ్రపర, జగత్సింగ్పుర్ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ముందస్తు చర్యగా పూరీ బీచ్లో ప్రజలను ఖాళీ చేయించారు. కొల్కతా, దక్షిణ బెంగాల్లోని అనేక ప్రాంతాల్లోనూ ఆదివారం వర్షాలు ముంచెత్తాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇందుకోసం 115 బహుళ ప్రయోజన శిబిరాలను, మరో 135 తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంతాల నుంచి 17,900 మంది ప్రజలను శిబిరాలకు తరలించామని ఎన్డిఆర్ఎఫ్ అధికారులు తెలిపారు. 'జావద్' కారణంగా విస్తారంగా వర్షాలు పడుతున్నందున కొల్కతా, దిగా, మందర్మని బక్కాహలి, ఫ్రజీర్గంజ్, ఇతర తీర ప్రాంతాలకు పర్యాటకులు ఎవ్వరూ రావవద్దని అధికారులు హెచ్చరించారు. హూగ్లీ నదిలో పడవల రాకపోకలను నిలిపివేశారు. రానున్న 24 గంటల్లో కొల్కతా, హౌరా, ఉత్తర 24 పరగణాలు, పుర్బా, పశ్చిమ మిడ్నాపుర్ జిల్లాల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే వీలుందని భారత వాతావరణ విభాగం ఆదివారం తెలిపింది.