Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : బీజేపీలో చేరితే కేంద్రంలో మంత్రి పదవి, కోరినంత డబ్బు ఇస్తామంటూ ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు తనకు ఆఫర్ చేశారని ఆమాద్మీ పార్టీ పంజాబ్ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ భగవంత్ మన్ ఆదివారం చెప్పారు. పంజాబ్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాషాయ పార్టీ తనకు ఈ ఆఫర్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. డబ్బుకో, పదవులకో తాను లొంగనని స్పష్టం చేశారు. తాను ప్రత్యేక కార్యాచరణ (మిషన్) కోసం పనిచేస్తున్నానని, కమీషన్ (ఎర) కోసం కాదని సదరు బిజెపి నేతతో తాను చెప్పినట్లు భగవంత్ తెలిపారు. అయితే తనకు ఆఫర్ చేసిన బీజేపీి నేత ఎవరనేదీ తగిన సమయంలో వెల్లడిస్తానన్నారు. పంజాబ్లో బీజేపీికి ఉనికే లేదని చెప్పారు. బిజెపి పట్ల రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనీ, బీజేపీి గ్రామాల్లోకి అడుగుపెట్టే పరిస్థితి కూడా లేదని ఆయన తెలిపారు.