Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సస్పెండ్ అయిన ఎంపీల్లో చతుర్వేది ఒకరు
న్యూఢిల్లీ : పార్లమెంటు కార్యాక్రమాలను ప్రసారం చేసే సంసద్ టివిలో వ్యాఖ్యాత పదవికి శివసేన నేత, రాజ్యసభ సభ్యులు ప్రియాంక చతుర్వేది రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివారం నాడు సంసద్ టివి ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ఆమె రాజీనామా లేఖను పంపారు. రాజ్యసభ నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేసిన 12 మంది ఎంపీల్లో చతుర్వేది ఒకరు. సంసద్ టివిలో ప్రసారమయ్యే 'మేరీ ఖహానీ' కార్యక్రమానికి ఆమె వ్యాఖ్యాత. పార్లమెంటు విధుల నుంచి తనను సస్పెండ్ చేసిన నేపథ్యంలో సంసద్ టివిలో తన కార్యాక్రమానికి సమయం కేటాయించడం లేదని ఆమె వాపోయారు. 'అత్యంత విచారంతో సంసద్ టివి 'మేరీ ఖహానీ' కార్యక్రమ వ్యాఖ్యాత పదవి నుంచి వైదొలుగుతున్నాను. సంసద్ టివిలో నా కార్యక్రమానికి సమయం పొందలేకపోతున్నాను. నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ అయిన ఎంపీల్లో ఒకరుగా ఉండటం వల్ల నేను సమయం పొందలేకపోతున్నాను' అని ఆమె పేర్కొన్నారు.