Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : 12 మంది ఎంపీలను సస్పెండ్ చేయడంపై పార్లమెంట్ ఆవరణంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ప్రతిపక్షాలు సోమవారం ఆందోళనకు దిగాయి. ప్లకార్డులు చేబూని ''తుగ్లక్ షాహీ బ్యాండ్ కరో, హిట్లర్ షాహీ నహీ చలేగీ, మోడీ షాహి నహీ చలేగీ''అంటూ నినాదాలు హౌరెత్తించారు. సస్పెన్షన్ అప్రజాస్వామికమని, రాజ్యసభలోని అన్ని నిబంధనలను ఉల్లంఘించడమేనని ప్రతిపక్ష సభ్యులు పేర్కొన్నారు. మరోవైపు సస్పెండ్ అయిన 12 మంది ఎంపిలు తమ ధర్నాను సోమవారం కూడా కొనసాగించారు.
సంసద్ టీవీకి శశి థరూర్ రాజీనామా చేశారు
రాజ్యసభ నుంచి సస్పెన్షన్‌కు గురైన 12 మంది ప్రతిపక్ష ఎంపీలకు సంఘీభావం తెలిపేందుకు కాంగ్రెస్‌కు చెందిన లోక్‌సభ ఎంపీ శశి థరూర్ సంసద్ టీవీ చర్చా కార్యక్రమం హౌస్ట్‌గా వైదొలిగారు. సంసద్ టీవీలో టాక్ షో 'టు ది పాయింట్' హోస్ట్‌గా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు శశి థరూర్ సోమవారం ట్విట్టర్ పోస్ట్‌లో తెలిపారు.