Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరిచిన ఏపి, తెలంగాణ భవన్ అధికారులు
న్యూఢిల్లీ :అంబేద్కర్ తన మహాపరినిర్వాన్ దివస్ సందర్భంగా ఆయన విగ్రహానికి పలువురు నివాళులర్పించారు. సోమవారం పార్లమెంట్ ఆవరణలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, కేంద్ర మంత్రులు వీరేంద్ర కుమార్, రాందాస్ అథ్వాలే తదితరులు ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు
మరిచిన అధికారులు
అంబేద్కర్ మహాపరినిర్వాన్ దివస్ను ఏపి భవన్, తెలంగాణ భవన్ అధికారులు మరిచిపోయారు. సోమవారం ఉదయం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డి, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజరు తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ వర్థంతి నిర్వహించేలా చూసే బాధ్యత ఏపి, తెలంగాణ ముఖ్యమంత్రులకు లేదా? అని ప్రశ్నించారు. దీంతో మధ్యాహ్నం 12.30 గంటలకు తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేయగా, ఏపి భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనా మధ్యాహ్నం 2.30 గంటలకు పూలమాలేసి నివాళుర్పించారు.