Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లీటర్ పెట్రోల్‌పై సుంకం రూ. 27.9..2013-14లో కేవలం రూ.9.2
న్యూఢిల్లీ : దేశంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ రూపంలో లీటర్‌కు రూ.27.9 వసూలు చేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2013- 14లో లీటర్ పెట్రోల్‌కు రూ.9.2 ఎక్సైజ్ డ్యూటీ ఉంటే, ఇప్పుడు లీటర్‌కు రూ.27.9 వసూలు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అలాగే 2013-14లో లీటర్ డీజిల్‌కు రూ.3.46 ఎక్సైజ్ డ్యూటీ ఉంటే, ఇప్పుడు రూ.21.80 ఉందని తెలిపారు. 2014-15 నుంచి 2020-21 వరకు 1.67 లక్షల కోట్లు ఎక్సైజ్ డ్యూటీ వసూలు చేసినట్టు కేంద్ర మంత్రి తెలిపారు.