Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికుల కోసం గట్టిగా నిలబడ్డారు : తరిగామి
- ఆయన లేని లోటు పూడ్చలేనిది..
న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు, జమ్మూ ప్రాంతీయ కార్యదర్శి శ్యాం ప్రసాద్ కేసర్ స్థానిక నారాయణన్ హాస్పిటల్లో ఆదివారం ఉదయం మృతిచెందారు. ఆయన మృతికి సీపీఐ(ఎం) నాయకుడు యూసఫ్ తరిగామి సంతాపం తెలిపారు. పార్టీ పట్ల నిబద్ధత కలిగిన నాయకుడ్ని కోల్పోవడంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
శ్యాం ప్రసాద్ కేసర్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్రంలో కార్మికుల హక్కుల కోసం శ్యాం ప్రసాద్ కేసర్ గట్టిగా నిలబడ్డారని, జమ్మూ ప్రాంతంలో శాంతిసామరస్యాలు నెలకొల్పడంలో ఆయన ఎనలేని కృషి చేశారని కొనియాడారు. విభజన రాజకీయాలకు ఏనాడూ తలొగ్గలేదని తరిగామి అన్నారు. ఎంతో విలువైన కార్యకర్తను పార్టీ కోల్పోయిందన్నారు. శ్యాం ప్రసాద్ కేసర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.