Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అమాయక పౌరులు, ఒక సైనికుడు మరణానికి దారితీసిన సైనిక చర్యను సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. పొలిట్ బ్యూరో ఈ మేరకు ఇక్కడ ఒక ప్రకటన విడుదల జేసింది. భద్రతా దళాల కాల్పుల్లో మరణించినవారి కుటుంబాలకు పొలిట్‌బ్యూరో తన ప్రగాఢ సానుభూతిని తెలి యజేసింది. మృతుల కుటుంబా లకు తగు రీతిన కేంద్రం పరిహారం చెల్లిం చాలని డిమాండ్ చేసింది. ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లనే ఈ దారుణ హత్యా కాండ చోటుచేసుకుందని సైన్యం వివరణ ఇచ్చింది. అయితే, మాటు వేసి దాడి చేయాల్సిన అవసరమేమొచ్చిందో అది వివరించలేదు. కాబట్టి దీనిపై తక్షణమే లోతైన దర్యాప్తునిర్వహించి, దోషులను కఠినంగాశిక్షించాలని పార్టీ పొలిట్ బ్యూరో డిమాండ్ చేసింది. సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేయాల్సిన ఆవశ్యకతను ఇది మరోసారి నొక్కి చెబుతోందని పేర్కొంది.