Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిజిన్వెస్ట్మెంట్కు త్వరలోనే క్యాబినెట్ అనుమతి
ముంబయి : ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని మోడీ ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో), హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్(హెచ్‌సీఎల్)లలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కీలక దశలో ఉందని సమాచారం. ఈ రెండు పిఎస్‌యుల్లో వ్యూహాత్మక వాటాల అమ్మకాల కోసం పెట్టుబడుల ఉపసంహరణ శాఖ దీపమ్ త్వరలోనే క్యాబినెట్ అనుమతి కోరనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై గనుల మంత్రిత్వ శాఖతో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే అనుమతులు పంపడం జరగుతుందని పేరు చెప్పుకోవడానికి ఆసక్తి చూపని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే క్యాబినెట్ ఆమోదం సహా అన్ని అనుమతులనూ పూర్తి చేసుకోవడం ద్వారా వచ్చే ఏడాది వాటాల విక్రయం జరుగొచ్చని అంచనా. ప్రభుత్వానికి హిందుస్థాన్ కాపర్‌లో 66.14 శాతం వాటా, నాల్కోలో 51.28 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. వీటిలోని మెజారిటీ వాటాలను ప్రయివేటు శక్తులకు విక్రయించి.. కొద్ది మొత్తం వాటాను మాత్రం కేంద్రం తన వద్ద ఉంచుకోవాలని భావిస్తోంది. హిందుస్థాన్ కాపర్‌లో వాటాల కొనుగోలు చేయాలని అనీల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత గ్రూప్ ఎప్పటి నుంచి ఉవ్విళ్లురుతోంది. 17 పీఎస్‌యూల్లో వాటాల విక్రయ ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నాయని ఇటీవలే కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.75 లక్షల కోట్ల విలువ చేసే పీఎస్‌యూల వాటాలను విక్రయించాలని మోడీ సర్కార్ బడ్జెట్లో లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే.