Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కొంకిణి కథా రచయిత దామోదర్ మౌజో(77)కు దేశ అత్యున్నత సాహిత్య పురస్కారం జ్ఞానపీఠ్ అవార్డు లభించింది. అస్సామీ కవి నీలమణి ఫూకాన్కు 56వ (2020) జ్ఞానపీఠ్ అవార్డు, కొంకణి చిన్న కథా రచయిత, నవలా రచయిత దామోదర్ మౌజోకు 57వ (2021) జ్ఞానపీఠ్ అవార్డును ప్రకటించారు. దామోదర్ మౌజో గోవాలో జన్మించారు. చిన్న కథా, నవలా రచయిత, కాలమిస్ట్, స్క్రీన్ రైటర్ అయిన ఆయన మూడు దశాబ్దాలకు పైగా కొంకణి భాషా సాహిత్యంలో అనేక రచనలు చేశారు. మౌజో రెండు నవలలు, చిన్న కథా సంకలనాలు, పుస్తకాలు రచించారు. 1983లో కార్మెలిన్ నవలకు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
ఇది పన్నెండు భాషల్లోకి అనువదించబడింది. అతని అనేక కథలు అనేక జాతీయ సంకలనాలు, పత్రికల్లో ప్రచురించబడ్డాయి. అతని కొన్ని కథలు ఇంగ్లీషుతో పాటు పోర్చుగీస్ మరియు ఫ్రెంచ్ భాషల్లోకి అనువదించబడ్డాయి. దామోదర్ మౌజో అనేక అవార్డులను గెలుచుకున్నారు. అతను క్రియేటివ్ ఫిక్షన్ 1998 కథా అవార్డు, 1997 గోవా స్టేట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ సంభాషణ అవార్డు, గోవా కళా అకాడమీ అవార్డు, కొంకిణి భాషా మండల అవార్డును గెలుచుకున్నాడు. మౌజో 2011-2012కి భారత ప్రభుత్వ సాంస్కతిక మంత్రిత్వ శాఖ నుంచి సీనియర్ ఫెలోషిప్ కూడా పొందారు. కల్బుర్గీ హత్యానంతరం.. దేశంలో భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించటాన్ని ఆయన వ్యతిరేకించారు.
నీలమణి ఫుకాన్..
అస్సామీ కవి నీలమణి ఫుకాన్కు గతేడాదికిగాను (2020) అవార్డును మంగళవారం ప్రకటించారు. జ్ఞానపీఠ్ అవార్డు పొందిన అస్సామీ కవి నీలమణి ఫుకాన్ 1933లో అసోంలోని దర్గావ్లో జన్మించారు. అతను 1981లో అస్సామీ సాహిత్య అకాడమీ అవార్డు, 1990లో అస్సామీ భాషలో తన సాహిత్య కృషికి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.