Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెన్-బెత్వా నదుల అంతర్ లింకింగ్ ప్రాజెక్ట్‌కు నిధులు
- కేంద్ర మంత్రి వర్గం ఆమోదం
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ (పీఎంఏవైజీ)ని 2024 వరకు కొసాగించేందుకు కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రి వర్గం జరిగింది. పీఎంఎవైజీని మార్చి 2021తరువాత కూడా కొనసాగించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదనను కేంద్ర మంత్రి వర్గం ఆమోదిం చింది. ఈ పథకం కింద 2021మార్చి 31నాటికి మొత్తం 2.95 కోట్ల ఇళ్ల నిర్మాణం లక్ష్యమని, అయితే లక్ష్యం పూర్తి కానందున 2021 మార్చి తరువా త మిగిలిన 155.75 లక్షల ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిం చాలని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించినట్లు తెలిపింది.మిగిలిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి ఈ పథకాన్ని మార్చి 2024వరకు కొనసాగించ నున్నట్లు కేంద్రం పేర్కొంది. కెన్-బెత్వా నదుల అంతర్ లింకింగ్ ప్రాజెక్ట్‌కి నిధులు మంజూరు చేయడం, అమలు చేయడానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. కెన్-బెట్వా లింక్ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం 2020-21 ధర స్థాయిల ప్రకారం రూ.44,605కోట్లుగా అంచనా వేశారు. కేంద్ర మంత్రివర్గం ప్రాజెక్ట్ కోసం రూ.39,317కోట్ల కేంద్ర మద్దతును ఆమోదించి ంది,రూ.36,290 కోట్ల గ్రాంట్, రూ.3,027కోట్ల రుణాన్ని ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ దేశంలోని నదీ ప్రాజెక్టులను మరింత అనుసం ధానించడానికి మార్గం సుగమం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.