Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: తామిళనాడులోని రామనాధపురంలో విద్యార్థి ఎల్.మణికందన్ పోలీసు కస్టడీ నుంచి విడుదలైన మరుసటిరోజే మృతి చెందటం తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే తన కుమారుడిది పోలీసు కస్టోడియల్ మరణమంటూ అతని కుటుంబం కోర్టును ఆశ్రయించింది. మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ మణికందన్ మృతదేహానికి తిరిగి పోస్ట్ మార్టం చేయాలని ఆదేశించింది. వివరాల్లోకెళ్తే.. రామనాధపురంలోని ఓ కాలేజీలో చదువుతున్న మణికందన్ తన స్నేహితుడితో బైక్ మీద వెళ్తుండగా, పరమకుడి-కీజాతొరోవల్ రోడ్డులో వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. అయితే, అయితే వారి నుంచి తప్పించుకోవడానికి మణికందన్, అతని స్నేహితుడు ప్రయత్నించారు. కానీ, పోలీసులు వారిని పట్టుకొగా అతని స్నేహితుడు భయంతో పారిపోయాడు. దీంతో పోలీసులు మణికందన్‌ను స్టేషన్‌కు తరలించారు. అనంతరం అతని తల్లి రామలక్ష్మీకి సమాచారం అందించగా.. మణికందన్‌ను తల్లిదండ్రులు పోలీసు స్టేషన్ వచ్చి ఇంటికి తీసుకువెళ్లారు. అయితే మరుసటి రోజు ఉదయం మణికందన్ స్పృహలో లేకపోవడం గమనించిన తల్లిదండ్రులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మణికందన్ మరణించాడని వైద్యులు తెలిపారు. మణికందన్‌కు పోస్ట్‌మార్టం చేయించిన పోలీసులు.. తల్లిందండ్రులకు అప్పగించారు.
అయితే తమ కొడుకును స్టేషన్లో పోలీసులు హింసించడం వల్ల మారణించాడని కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. దీనిపై విచారణ జరుపుతామని పోలీసు అధికారలు చెప్పడంతో నిరసన విరమించారు. సోమవారం పోలీసులు పోలీసు స్టేషన్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేశారు. అతని శరీరానికి ఎటువంటి గాయం లేదనీ, పోలీసులు హింసించలేదని పోలీసు ఉన్నతాధికారి పేర్కొన్నారు. వాహన తనిఖీల్లో భాగంగా అడ్డుకున్నామనీ, అతని స్నేహితుడు గంజాయి కేసుల్లో ఉన్నాడని తెలిపారు. అయితే, పోలీసులు హింసించడంతోనే చనిపోయాడని మణికందన్ చనిపోయాడని వారు కోర్టు ఆశ్రయించారు. పోలీసులు చాలా తక్కువ నిడివి ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే విడుదల చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో మణికందన్ మృతదేహానికి రీపోస్ట్ మార్టం చేయాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం మణికందన్ మృతి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.