Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంజయ్ గాంధీ, మాధవ్ రావ్ సింధియా నుంచి లోక్‌సభ స్పీకర్ వరకు ...
ఇద్దరు ముఖ్యమంత్రులు కన్నుమూత
న్యూఢిల్లీ: బీపీన్ రావత్ హెలికాప్టర్ క్రాష్ అయ్యాక..అంతకుముందు ఎందరో ప్రముఖులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలన్నింటిని మళ్లీ గుర్తుకు తెచ్చింది. భారత రాజకీయ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి, సంజరు గాంధీ, మాధవ్ రావ్ సింధియా, జీఎంసీ బాల్ యోగి, ఎస్ మోహన్ కుమారమంగళం, ఓపీ జిందాల్, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండూ విమాన ప్రమాదాల్లో అసువులు బాశారు.
1.1963.. నవంబర్ 23: జమ్మూ కాశ్మీర్‌లోని పూంఛ్‌లో భారత వైమానిక దళానికి చెందిన విమానం కూలిపోయింది. ఇందులో వైమా నిక దళానికి చెందిన ఆరుగురు అధికారులు ప్రాణాలు కోల్పో యారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో లెఫ్టినెంట్ జనరల్ దౌలత్ సింగ్, లెఫ్టినెంట్ జనరల్ బిక్రమ్ సింగ్ , ఎయిర్ వైస్ మార్షల్ ఎర్లిక్ పింటో కూడా ఉన్నారు.
2. 31 మే 1973..మే 31: కాంగ్రెస్ నాయకుడు మోహన్ కుమార్ మంగళం కూడా విమాన ప్రమాదంలో కన్నుమూశారు. ఇండియన్ ఎయిర్‌లైన్స్ 440 విమానం ఢ కొనగా..అతని మృతదేహాన్ని పార్కర్ పెన్నుతో గుర్తించారు.
3. 1980..జూన్ 23: భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ కూడా విమాన ప్రమాదంలో మరణించారు. న్యూఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ విమానాశ్రయం సమీపంలో జరిగిన ప్రమాదంలో ఆయన చనిపోయారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అతను ప్రయాణానికి బయలుదేరలేదు. కానీ అతను తన స్వంత ప్రయివేట్ విమానంలో ఉండగా విషాదం చోటుచేసుకున్నది. సంజరు మంచి పైలట్. ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తుండగా..ఈ ప్రమాదం జరిగినట్టు ఏవియేషన్ శాఖ గుర్తించింది.
4. 2001లో అరుణాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నతుంగ్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు.
5. 2001.. సెప్టెంబర్ 30: ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో జరిగిన విమాన ప్రమాదంలో కాంగ్రెస్ నాయకుడు మాధవరావు సింధియా కూడా మరణించారు. తన 10 సీట్ల ప్రయివేట్ విమానంలో బయలుదేరారు. అందులో నలుగురు జర్నలిస్టులు కూడా ఉన్నారు. దృశ్యమానత సరిగా లేకపోవడంతో ఈ సంఘటన జరిగినట్టు అధికారులు అంచనాకొచ్చారు.
6. 2002.. మార్చి 3: లోక్‌సభ స్పీకర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు జీఎంసీ బాలయోగి కూడా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. బెల్ 206 అనే హెలికాప్టర్లో బాలయోగి ఉండగా...టేకాఫ్ అవుతున్నపుడు కొబ్బరి చెట్లు తాకటం.. దృశ్యమానత సరిగా లేకపోవడమే ఘటనకు కారణమని నిర్ధారించారు.
7.. 2004 సెప్టెంబర్ కేంద్ర మంత్రి, మేఘాలయ కమ్యూనిటీ డెవలప్మెంట్ మంత్రి సి సంగ్మా మరణణ కూడా హెలికాప్టర్ క్రాష్‌తో అయింది. పవన్ హన్స్ అనే హెలికాప్టర్లో సంగ్మా గౌహతి నుంచి షిల్లాంగ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
8. 2005.. మార్చి 31: హర్యానా విద్యుత్ శాఖ మంత్రి ఓపీ జిందాల్ కూడా విమాన ప్రమాదంలో మరణించారు. సాంకేతిక లోపంతో ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో విమానం కూలిపోయిందని దర్యాప్తులో తేలింది.
9. 2009.. 3 సెప్టెంబర్: ఆంధ్రప్రదేశ్‌కు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ చిత్తూరు జిల్లాలోని నల్లమల అడవిలో కూలిపోయింది. ఇది అమెరికన్ టెక్నాలజీ ఆధారంగా డబుల్ ఇంజిన్‌తో కూడిన బెల్ 430 ఛాపర్. 27 గంటల తర్వాత వైఎస్ఆర్ మృతదేహం లభ్యమైంది.
10. తన జీవితాన్ని కోల్పోయిన మొదటి రాజకీయ నాయకుడు సుభాస్ చంద్రబోస్ అని నమ్ముతారు, అతని విమానం 18 ఆగస్టు 1945న కూలిపోయింది, అయితే అతని మరణంపై ఇప్పటికీ సందేహాలు ఉన్నాయి.